« ఇది కోతకు సమయం పనివారి తరుణం
Idhi kothaku samayam panivaari tharunam
share with whatsapp

పల్లవి:
ఇది కోతకు సమయం పనివారి తరుణం – ప్రార్ధన చేయుదమా    (2X)
పైరును చూచెదమా – పంటను కోయుదమా    (2X)
...ఇది కోతకు ...
1.
కోతెంతో విస్తారమాయెనే కోతకు పనివారు కొదువాయెనే    (2X)
ప్రియయేసు నిధులన్ని నిలువాయెనే     (2X)
...ఇది కోతకు...
2.
సంఘమా మౌనము దాల్చకుమా కోసెడి పనిలోన పాల్గొందుమా    (2X)
యజమాని నిధులన్ని మీకే కదా    (2X)
...ఇది కోతకు...
3.
శ్రమలేని ఫలితంబు మీకీయగా కోసెడి పనిలోన పాల్గొందుమా    (2X)
జీవార్ధ ఫలములను భుజియింతమా    (2X)
...ఇది కోతకు...